నేటి కాలంలో మనిషి రూపంలో ఉన్న మృగాలు, రాక్షలు పెరిగిపోతున్నారు. ఎక్కడ చూసిన మానభంగాలు, హత్యలు, దోపిడి వంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి అరాచకాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటి.. అక్కడక్కడ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ..దారుణం ఏమిటంటే మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. పట్టపగలే మనిషిని మనిషి దారుణంగా చంపేస్తున్నాడు. ఇది చూస్తునే ఉంటారు..కానీ ఎవరు ముందుకెళ్లి అడ్డుకునే సాహసం చేయలేరు. తాజాగా 25 ఏళ్ల యువకుడిని అత్యంత కిరాతకంగా కత్తులతో పొడి పొడిచి చంపేశారు. ఈ హత్యకు సంబంధించి.. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం..
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుందర్ నగ్రి ప్రాంతంలో మనీష్ అనే 25 ఏళ్ల యువకుడిని శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు నడిబజారులో అతి దారుణంగా హత్య చేశారు. రోడ్డు పై అందరూ చూస్తుండగానే 60సార్లు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. అక్కడ అందరూ చూస్తూ వెళ్తున్నారే కానీ అడ్డుకునే ప్రయత్నం ఓ ఒక్కరు చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ దారుమ హత్యకు పాల్పడిన ఆలం, బిలాల్, ఫైజాన్ అనే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఈహత్యను ఎవరు చేయించలేదని, వారి మధ్య ఉన్న పాత కక్షలే కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మనీష్ సోదరు డు మాట్లాడుతూ.. తన సోదరుడిపై దాడి చేసి ప్రస్తుతం జైల్లో ఉన్న మొహసిన్, ఖాసీంల స్నేహితులైన ఆ ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. గతంలో ప్రతీకారం తీర్చుకుంటామని వారు బెదిరించారు. అన్నట్లుగానే ఈ రోజు నా సోదరుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు” అని తెలిపాడు.
Delhi | Locals protest after the murder of a 25-yr-old man identified as Manish in the Sunder Nagri area of North East Delhi last night.
Police say the man was stabbed to death by 3 men from a different community last night. Three suspects identified pic.twitter.com/hPi583aEcR
— ANI (@ANI) October 2, 2022
#UPDATE | Three accused have been arrested in connection with the murder of a 25-yr-old man identified as Manish in the Sunder Nagri area of North East Delhi last evening: Delhi Police pic.twitter.com/YXbQ9sVwIy
— ANI (@ANI) October 2, 2022
Muslims at it again.
A youth named Manish was stabbed to death in Sunder Nagri area of Delhi, 3 accused (Aalam, Bilal and Faizan) arrested by Delhi Police.He was stabbed 60 times even after he was dead. Manish was already under threat to withdraw a case against the accused. pic.twitter.com/NGfLohdlum
— Abhishek Singha (@Abhishe67702442) October 2, 2022