అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య న్యూడ్ ఫొటోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోయంబత్తూరుకు చెందిన 27 ఏళ్ల ఓ బ్యాంక్ ఉద్యోగినికి గాంధీపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పిచ్చై ముత్తుతో 2020, అక్టోబర్ 29వ తేదీన పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లి కోసం కట్నంగా 51 సవర్ల బంగారం, 5 లక్షల రూపాయలు వరుడికి ఇచ్చారు. పెళ్లి జరిగిన తర్వాత కొన్ని నెలల వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాతి నుంచి పిచ్చై తన నిజస్వరూపం బయటపెడుతూ వచ్చాడు. భార్య ముఖంపై మచ్చలు ఉన్నాయని, కలిసి ఉండటం కష్టమని అనేవాడు.
ఈ నేపథ్యంలో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పిచ్చై తనకు అదనపు కట్నంగా ఓ ఇళ్లు కావాలని అత్తమామలను డిమాండ్ చేయటం మొదలుపెట్టాడు. అంతేకాదు! భార్యను నగ్నంగా చేసి ఆమె ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూపించి ఆమెను బెదిరించసాగాడు. తనకు ఇళ్లు కావాలని ఇబ్బంది పెట్టేవాడు. గత శనివారం పిచ్చై కుటుంబసభ్యులు బాధితురాలిపై దాడి చేసి గాయపర్చారు. దీంతో ఆమె కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఆమె భర్తను అరెస్ట్ చేశారు.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.