నేటికాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. పెళ్లైన కొందరు మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి వాడి కోసం తహతహలాడుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.., ఇలా ఒకరిని కాదని మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి ఎటుకాకుండా పోతున్నారు. మరికొందరు మహిళ.. భర్త చనిపోయాడని పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రియుడి మోజులో పడి పేగు బంధాన్ని సైతం మరచి.. కన్నబిడ్డలను హత్య చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘోరమైన ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రియుడితో ఏకాంతానికి భంగం కలిగిస్తుందని తన రెండేళ్ల కూతుర్ని చంపింది ఓ కాసాయి తల్లి. అమ్మ అనే పదానికి మాయని మచ్చ తెచ్చింది. ఈ దారుణమైన ఘటన నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు లచ్చుగూడేనికి చెందిన చెందిన రమ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి అయిదేళ్ల కుమారుడు శివరాం, రెండేళ్ల కుమార్తె ప్రియాన్షిక ఉన్నారు. అయితే స్థానికంగా కూలీ పనులు చేస్తూ వెంకన్న కుటుంబాన్ని పోషించే వాడు. అయితే 2022లో కరోనా కారణంగా వెంకన్న మృతి చెందాడు. దీంతో రమ్య పిల్లలు, అత్త,మామలతో కలిసి ఒక్కే ఇంట్లో నివాసం ఉంది. ఈ క్రమంలో రమ్య బుద్ది పెడదారి పట్టింది. అదే గ్రామానికి చెందిన పెరిక వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో రమ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వెంకటేశ్వర్ల మోజులో పడిన రమ్య అత్తవారి ఇంట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది.
దీంతో అత్తవారింటి నుంచి వెళ్లిపోయి అదే గ్రామంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది. ఆ అద్దె ఇంట్లో పిల్లలతో ఉంటూ అతనితో సహజీవనం చేస్తోంది. ఈక్రమంలో ఏడేళ్ల శివరాం స్కూల్ కి వెళ్తుండే వాడు. అయితే రెండేళ్ల ప్రియాన్షికా తల్లి వద్దనే ఉండేది. దీంతో తమ వివాహేతర సంబంధానికి ఆ చిన్నారి అడ్డొస్తోందని భావించి హత్య చేసేందుకు రమ్య, ఆమె ప్రియుడు పథకం పన్నారు. అందులో భాగంగా.. మొదట అత్తమామలపై ఓ అసత్యవార్తను ప్రచారం చేసింది. తన పిల్లలకు ఏదైనా హాని జరిగితే అత్తామామలే కారణమని వీడియో తీసి..వివిధ గ్రూపుల్లో పోస్టు చేసింది. ఇక ఈ నెల 14న రాత్రి సమయంలో రమ్య, ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లు.. ఆ రెండేళ్ల చిన్నారిని గోడకేసి విసిరి కొట్టారు. అంతటితో ఆగక ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పాపకు మూర్ఛ వచ్చిందని చెప్పి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అదే రోజు రాత్రి తీసుకెళ్లారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు.
దీంతో ఆ చిన్నారి మృతదేహాన్ని మార్చురీలో ఉంచి రమ్య, వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే విషయం తెలుసుకున్న రమ్య అత్తమామలు ఆసుపత్రికి చేరుకుని చిన్నారిని పరిశీలించారు. పాప ముఖంపై దెబ్బలను గమనించిన వాళ్లు కోడలిపై అనుమానం వ్యక్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ యదగిరి ఇచ్చి న ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రమ్య, ఆమె ప్రియుడు వెంకన్నను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇలా కొందరు మహిళలు పరాయి వాడితో పడక సుఖం కోసం నవ మోసాలు మోసి.. కనీ..పెంచిన బిడ్డలనే దారుణంగా చంపేస్తున్నారు. మరీ ఈదారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.