ఈ మధ్యకాలంలో మహిళలు, పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. కొందరు మహిళ అనుమానస్పద స్థితిలో హత్యకు గురవుతున్నారు. కొందరి మరణానికి భర్త, కుటుంబ సభ్యులే కారకులు కావడం గమన్హరం. తాజాగా ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆ మహిళను గొంతుకోసి మరీ హతమార్చడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చిత్తూరు జిల్లా గంగవరం గ్రామానికి చెందిన యాదగిరి, రోజా భార్యాభర్తలు. వీరికి రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే యాదరిగి, రోజా దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలో భర్త పనికి వెళ్లగా రోజా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈక్రమంలో ఒంటరిగా ఉంటున్న రోజా దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం రోజాను గొంతు కోసి హత్య చేశారని మృతురాలి భర్త యాదగిరి గ్రామస్థులకు తెలిపాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారు ఆదేశాల మేరకు డాగ్ స్కాడ్ ను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. అయినప్పటికీ ఘటన స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.ఇంతలేనే రోజా మరణ వార్త తెలుసకున్న ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు.
తమ బిడ్డను ఏ దుండగులు చంపలేదని, యాదగిరే హత్య చేసే ఉంటాడని ఆరోపించారు. అంతేకాక యాదగిరిపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రికత్త ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. హత్యజరిగిన తీరుపై చాలా అనుమానాలు ఉన్నాయని, పకడ్బందీగా ఈ కేసు దర్యాప్తు చేసి అసలు నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.