ఈ మధ్య కాలంలో మనుషుల్లో సహనం, ఓర్పు తగ్గిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఆవేశ పడి గొడవలకు దిగుతున్నారు. చిన్న విషయంతో మొదలవుతున్న గొడవులు.. పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు హత్యకు దారితీసున్నాయి. తాజాగా చిన్న విషయానికి ఆవేశపడిన ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. వాహన బుకింగ్‌కు సంబంధించి OTP నంబర్ తెలియజేయక పోవడంతో ఆ క్యాబ్‌డ్రైవర్.. ఓ ప్రయాణికున్ని, అతడి భార్య, పిల్లల ఎదుటే కొట్టి మరీ చంపేశాడు. తమిళనాడులోని చెన్నైలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంతం గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉమేందర్(33) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. అతడు కోయంబత్తూరులోని ఓ ప్రముఖ సంస్థలో పని చేస్తున్నాడు. ప్రతి శని, ఆదివారం చెన్నైకు వచ్చి కుటుంబంతో గడుపుతాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఉమేందర్ భార్య భవ్య(30), పిల్లలు అక్రోశ్, కరణ్ తో పాటు భవ్య సోదరి దేవిప్రియ, ఆమె పిల్లలతో కలిసి అందరూ చెన్నైలోని ఓఎంఆర్ రోడ్డులోని సినీ కాంప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు. తరువాత అక్కడే కొద్ది సమయంలో షాపింగ్ చేశారు. అనంతరం వారు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో భవ్య సోదరి దేవిప్రియ క్యాబ్ బుక్ చేసింది. కారు ఎక్కాక డ్రైవర్ రవి బుకింగ్ ఓటీపీ నంబర్ చెప్పాలని కోరాడు. ఈ విషయమై ఉమేందర్ కి, క్యాబ్ డ్రైవర్ కి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.
ఈక్రమంలో కారు దిగే సమయంలో ఉమేందర్ కారు డోర్ ను బలంగా నెట్టాడు. దీంతో మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో క్యాబ్ డ్రైవర్ రవి.. ఉమేందర్ పై దాడి చేశాడు. దీంతో అతను స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో ఉమేందర్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Karnataka: ప్రియుడికి లక్ష ఇచ్చి ఫామ్ హౌస్ లో అడుగు పెట్టిన కోడలు.. అర్థరాత్రి మామ నిద్రిస్తుండగా!