సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వివాదం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసినప్పటికీ.. జూనియర్ ఆర్టిస్ట్ లపై జరుగుతున్న దారుణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోని మహిళలు బయటికి వచ్చి కాస్టింగ్ కౌచ్ లో ఎదుర్కొన్న సమస్యలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై వలసరవాక్కం ఏరియాలో నివసించే ఓ జూనియర్ ఆర్టిస్ట్(38) భర్త నుండి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. అప్పటినుండి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. ఇటీవల మార్చి 8న రాత్రి 10 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఆమె తట్టారని.. ఆమె తలుపు తెరవగానే కత్తితో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారట. ఆ తర్వాత ఆమె దాచుకున్న 50వేల డబ్బు, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సదరు జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ దారుణ దృశ్యాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించినట్లు తెలుస్తుంది. ఈ దారుణం జరిగిన వెంటనే బాధితురాలు వలసరవాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో.. రామాపురంకి చెందిన కన్నదాసన్, ఆయుపాకంకి చెందిన సెల్వకుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారని సమాచారం. నిందితులను రిమాండ్ కి తరలించి, చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ విధంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.