నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని ఘటనలు చూడగానే అసలు ఏం జరిగిందో ఈజీగా తెలిసిపోతుంది. మరికొన్ని సంఘటనలు మాత్రం పోలీసులకు పెద్ద టాస్క్ నే ఇస్తాయితాజాగా కారులో వెళ్తుండగా సాప్ట్ వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని ఘటనలు చూడగానే అసలు ఏం జరిగిందో ఈజీగా తెలిసిపోతుంది. మరికొన్ని సంఘటనలు మాత్రం పోలీసులకు పెద్ద టాస్క్ నే ఇస్తాయి. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడు పేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగుల బెట్టారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు సేకరించిన వివరాల ప్రకారం..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె సమీపంలో కారులో కాలిపోయిన స్థితిలో ఓ శవం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయి ఉంది. అయితే కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. అలానే ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. కారులో మృతి చెందిన వ్యక్తి వెదురుకప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు.
అతడు బెంగుళూరులోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం అర్దరాత్రి దాటిన తరువాత నాగరాజు ప్రయాణిస్తున్న కారును కొందరు దుండడగులు ఆపారు. ఆ తరువాత అతడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నాగరాజును సజీవ దహనం చేయడానికి వెనుక గల కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.