పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలోని ఓ టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్థరాత్రి హింస చెలరేగింది. ఈ నేత వర్గీయులు దాదాపు 12 ఇళ్ల తలుపులు మూసివేసి నిప్పటించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లో ప్రాంతంలో టీఎంసీకి చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ నేత భదుషేక్ సోమవారం రాత్రి 8.30కు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వెంటనే భదు షేక్ వర్గీయులు బర్షాల్ గ్రామంలో దాదాపు 12 ఇళ్లకు తలుపు బిగించి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. ఈ ఘటనకు టీఎంసీ నేత హత్య ఘటనతో సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ స్పందించారు. బీర్బూమ్ జిల్లా ఘటన, రాష్ట్రంలోని శాతిభద్రతల పరిస్థితికి దర్పణం పడుతోంది అని వ్యాఖ్యనించారు.పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసాత్మక సంఘటనలు జరుగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు జరిగిన అల్లర్లలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈఘటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.