భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సర్వసాధారణ విషయం. అయితే కొన్ని వ్యసనాల కారణంగా జరిగే గొడవలు మాత్రం సంసారాలను నిట్ట నిలువునా చీల్చేస్తాయి. తాజాగా మానవత్వం మరిచిపోయిన ఓ మనిషి.. కట్టుకున్న భార్యను, కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సర్వసాధారణ విషయం. అయితే కొన్ని వ్యసనాల కారణంగా జరిగే గొడవలు మాత్రం సంసారాలను నిట్ట నిలువునా చీల్చేస్తాయి. ముఖ్యంగా మద్యం అనేది ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. అంతేకాక ఈ మద్యానికి బానిసైన వ్యక్తులు విచక్షణ కోల్పోయి పశువుల ప్రవర్తిస్తున్నారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను, కుమార్తెను గొడలితో నరికి చంపాడు ఓ కీచక వ్యక్తి. భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భూపాలపల్లి జిల్లా వేశాలపల్లి గ్రామానికి చెందిన ఎలగంటి రమణాచారి, రమ(43) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఓ కుమార్తె , కుమారుడు ఉన్నారు. వీరికి కుమార్తె చందన(17)ఇంటర్ మీడియట్ సెకండియర్ చదువుుతుంది. స్థానికంగా పనులు చేసుకుంటు రమ కుటుంబాన్ని పోషిస్తుంది. కొంతకాలం పాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. అయితే కొంతకాలం నుంచి రమణాచారి మద్యానికి బానిసగా మారి.. నిత్యం భార్యతో గొడవ పెట్టుకునే వాడు.
ఆమె పిల్లల భవిష్యత్తు కోసం అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది. భార్య, పిల్లలు మద్యం తాగవద్దని ఎంత చెప్పిన రమణాచారి వినిపించుకునే వాడు కాదంట. అంతేకాక మద్యం తాగి వచ్చిన ప్రతి సారి.. డబ్బులు కావాలంటూ వారి వేధింపులుకు గురి చేసేవాడు. పిల్లలు సైతం తండ్రి చేస్తున్న గొడవలకు నిత్యం భయం భయంగా గడిపేవారంట. బుధవారం రాత్రి రమణాచారి బాగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. అంతేకాక మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరిచడంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రమణాచారి ఇంట్లో ఉన్న గొడలితో భార్య రమను నరికాడు.
అయితే తల్లిపై తండ్రి దాడి చేస్తుంటే చందన అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే మానవత్వం మరిచిన ఆ వ్యక్తి అడ్డుగా వెళ్లిన కుమార్తెను సైతం నరికి చంపాడు. ఈ దృశ్యం చూసిన వారి 9ఏళ్ల కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ బయటకి వచ్చాడు. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆ పిల్లవాడిని కాపాడారు. స్థానికులు సమాచారం అందిచడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు రమణాచారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.