విద్యార్థి అంటే విద్యను అర్జించే వాడు అని అర్థం. ఒకప్పుడు విద్య కోసం గురువు ఎన్ని శిక్షలు వేసిన భరించే వారు శిష్యులు. కానీ నేటికాలంలో కొందరు విద్యార్థుల్లో ఓర్పు, సహనం లేకుండా పోయింది. వారు చేసే తప్పులను ఎత్తి చూపి.. మందలిస్తున్న ఉపాధ్యాయులపై దాడులకు దిగడం లేదా తాము ఆత్మహత్యల పాల్పడటం చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి తరగతి గదిలో సెల్ఫీ తీసినందుకు ప్రిన్సిపాల్ మందలించారు. దీంతో ప్రిన్సిపాల్ పై కోపంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తన నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం భోగాపురం మోడల్ స్కూల్‌లో 9వతరగతి చదువుతున్నాడు యోగిందర్ రెడ్డి. పాఠశాల తరగతి గదిలో యోగితో పాటు కొంతమంది విద్యార్థులు సెల్ఫీలు తీసుకొని స్టేటస్ గా పెట్టుకున్నారని, ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ యోగితో పాటు కొంతమంది విద్యార్థులను పలుమార్లు పిలిపించి మందలించిందని తెలుస్తోంది. అయిన వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతని ప్రవర్తన సరిగా లేదని తండ్రికి ఫిర్యాదు చేసి.. టీసీ ఇచ్చారు ప్రిన్సిపల్ సంధ్యారాణి. తండ్రి అతడిని ఇంటికి తీసుకెళ్తుండగా పరారయ్యాడు. ఆ తర్వాత స్కూల్ కు సమీపంలోనే మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా యోగిందర్‌రెడ్డి మృతికి ప్రిన్సిపల్ సంధ్యారాణి వైఖరే మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.తాము హాస్టల్‌కు వెళ్లేసరికి చేతిగాయంతో ఉన్న తన కుమారుడిని మోకాళ్లపై కూర్చోపెట్టారని.. ఇదేమిటని అడిగిన తనను తీవ్రంగా దూషించారని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. కానీ విద్యార్థి ప్రవర్తన సరిగ్గా లేదని, చాలా సార్లు చెప్పి చూసిన వినలేదని. అందుకే ఆ విద్యార్థి తండ్రిని ప్రిన్సిపాల్ పిలిపించినట్లు సమాచారం. ఏది ఏమైనా మందలించినందుకే విద్యార్థి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.