నేటికాలంలో ప్రేమ పేరుతో వెంటపడి వేధించే కేటుగాళ్లు బాగా పెరిగిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని తరువాత అసలు నిజస్వరూపం బయటపెట్టి మృగాలు కూడా ఉన్నారు. ఇలా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పే వారిని నమ్మి ఎందరో ఆడపిల్లలు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరేందరో అనుమానస్పద స్థితిలో మరణిస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎంతో శక్తివంతమైనది. మనిషిని బుషిలాగా మార్చేది అదే.. పశువులాగా మార్చేది అదే. ప్రేమికులు ఎన్నో అవరోధాలను దాటుకుని పెళ్లి బంధంతో ఒక్కటవుతుంటారు. చాలా మంది ప్రేమికులు పెళ్లి తరువాత ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి జీవిస్తుంటారు. కానీ కొందరు మాత్రం గొడవలో సంసారాన్ని నాశనం చేసుకుంటారు. ఇక ఈ విషయాలు అలా ఉంచితే.. కొందరు కేటుగాళ్లు ప్రేమిస్తున్నామని వెంటపడి.. నువ్వులేకపోతే నేను లేను అంటూ సినిమా డైలాగ్స్ చెప్పి అమ్మాయిలను వలలో వేసుకుంటారు. తీర పెళ్లి చేసుకున్న తరువాత తమ అసలు నిజస్వరూపం బయట పెడుతుంటారు. ఇలాంటి మృగాల కారణంగా ఎందరో అమ్మాయిలు హత్యగావింపబడగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన కుమార్, బనగానపల్లి మండలం రామతీర్ధం గ్రామానికి చెందిన కళావతి(23) వరుసకు బావమరదలు అవుతారు. కుమార్, కళావతిని ప్రేమిస్తున్నాని చెప్పి వెంటపడే వాడు. అలా కొంతకాలం కళావతి కోసం వెంటపడి చివరకు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ఏడాది పాటు కళావతిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అయితే ఆ తరువాత కుమార్ తన నిజస్వరూపం బయట పెట్టాడు. కట్నం తీసుకురావలంటూ కళావతిని వేధించడం మొదలు పెట్టారు. చాలా రోజుల పాటు వారి వేధింపులను కళావతి భరించింది.
చివరకు భర్త, అత్త మామలు కట్నం తేవాలని వేధిస్తున్నట్లు కళావతి తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా కుమార్ వ్యవహారంపై పెద్దల సమక్షంలో ఒకసారి పంచాయితీ కూడా చేశారు. ఇలా జరిగిన తరువాత అనుహ్యాంగా బుధవారం సాయంత్రం అత్తవారింట్లో కళావతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారమైంది. అయితే ఇంట్లో మృతురాలి భర్త, అత్తమామ ఎవరు లేరు. కళావతి చనిపోయి ఉంటే ఇంట్లో ఎవరు లేకపోవడం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్, అతడి తల్లిదండ్రులు కలసి కళావతిని చంపేశారనే అనుమానం వ్యక్తమవుతుంది.
తమ కుమార్తెను కట్నం కోసం వేధించి.. హత్య చేసి చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించి పరారయ్యారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళావతి బీఈడీ చేసి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. చదువుకున్న తమ కుమార్తెను ఏ పనీ చేయని కుమార్ కి ఇచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశామని మృతురాలి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. మరి.. ఇలా వరకట్న వేధింపుల కారణంగా ఎందరో ఆడపిల్లలు బలికావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.