ఈ మధ్యకాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అక్రమ సంబంధాలు ఒకటి. వీటి కారణంగా ఎన్నో కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. కొందరు తమ భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. కొందరు మహిళ తమ సుఖాన్ని కడుపున పుట్టిన బిడ్డలు అడ్డుగా ఉన్నారని చంపేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మరికొందరు పరాయి వాడి మోజులో పడి.. జీవిత భాగస్వామిని దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం కోల్పోయింది. ప్రియుడితో సరసాలకు కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈశాన్యా రాష్ట్రానికి చెందిన రాకేశ్ తోమంగ్, దేబి తోమంగ్ భార్యాభర్తలు. వీరు కొన్నాళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు కు వచ్చి.. విద్యారణ్యపురంలో నివాసం ఉంటున్నారు. అయితే రాకేష్ కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తుండే వాడు. అలా కొంతకాలం పాటు ఈ దంపతుల సంసారం హాయిగా సాగింది. అయితే దేబి పక్క చూపులు చూడటం మొదలు పెట్టింది. ఈక్రమంలో బాబు అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇలా వారిద్దరు రాకేశ్ కు తెలియకుండా.. అతడి ఇంట్లోనే వివాహేతర సంబంధం కొనసాగించేవారు. అలా ఓ రోజు ప్రియుడితో కలిసి ఉండగా రాకేశ్ చూశాడు. దీంతో దేబీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
దీంతో ప్రియుడుతో పడక సుఖాన్ని అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యచేయాలని భావించింది. అదే విషయాన్ని ప్రియుడు బాబుకు చెప్పింది. ఇద్దరు కలిసి రాకేశ్ ను చంపేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి దేబి ఇంట్లోనే హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దేబి, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిచారు. పరాయి వాడితో పడక సుఖం కోసం జీవితాంతం తోడు ఉండే భర్తను చంపేసిన ఆ రాక్షసి బ్రతకడానికి వీల్లేదంటూ స్థానికి అభిప్రాయం వ్యక్తం చేశారు.