వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. అంటే కనిపించని దేవుళ్ల కన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లని అర్థం. అయితే మారుతున్న కాలంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు హరిమంటున్నాయి. వైద్యుల సేవాలోపం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో వైద్యుల నిర్లక్ష్యానికి 21 ఏళ్ల యువతి బలైంది. చేతి శస్త్ర చికిత్స కోసం వస్తే వైద్యుల ఉదాసీనత కారణంగా ఆ యువతి ప్రాణాలు కొల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు నగరానికి చెందిన తేజశ్విని అనే 21 ఏళ్ల యువతి ఆదివారం సాయంత్రం ఓ ఘటనలో తీవ్రంగా గాయపడింది. మారతహళ్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆమెను చేర్పించారు. ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైందని, ఆపరేషన్ చేయాలని తేజశ్విని కుటుంబానికి వైద్యులు సూచించారు. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆపరేషన్‌కు వైద్యులు సిద్ధమయ్యారు. ఆపరేషన్ కోసం తేజస్వినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. చేతికి ఆపరేషన్ చేశారు. మరి కారణం ఏంటో తెలియదు గానీ ఆపరేషన్ జరిగిన కొన్ని గంటలకే తేజశ్విని ప్రాణాలు కోల్పోయింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె చనిపోయినట్లు వైద్యులు తేజస్విని కుటుంబానికి చెప్పారు. తేజశ్విని మరణవార్త తెలిసిన ఆమె కుటుంబం కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: నేను చనిపోతున్నా. కానీ.., వాళ్ళని వదలకండి! కన్నీరు పెట్టిస్తున్న యువతి చివరి లేఖ!
వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీశారని, వైద్యులు నిర్లక్ష్యంతో తమ కూతురిని పొట్టనపెట్టుకున్నారని బాధిత కుటుంబం వైద్యులపై ఆరోపణలు చేసింది. సదరు ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న డా. శశాంక్, డా. అశోక్ శెట్టిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తేజస్విని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆమె మృతికి స్పష్టమైన కారణం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో తేలుతుందని, తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చేతికి శస్త్ర చికిత్స చేయించుకుని బాగుపడుతుందన్న ఆశతో వెళ్లిన 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చర్చనీయాంశమైంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BreakingNews | A 21-year-old woman dies after undergoing major surgery in #Bangalore. An FIR of death by negligence has been filed against the hospital doctors. | @Thoyajakshi1 reports. pic.twitter.com/ouWNG62w9D
— Mirror Now (@MirrorNow) May 30, 2022