అనుమానం అనేది పెనుభూతం లాంటిది. ఒక్కసారి మనిషిలోకి ఆ భూతం ప్రవేశిస్తే.. అంత సులువుగా బయటకి వెళ్లదు. అంతేకాక ఈ అనుమానం పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేస్తుంది. ఇలా అనుమానం కలిగిన కొందరు భర్తలు.. భార్యలకు నిత్యం నరకం చూపిస్తుంటారు. అలాంటి భర్తలు.. భార్యలు కాస్త చక్కగా రెడి అయినా, పక్కవారితో పొరపాటున మాట్లాడిన అనుమానిస్తారు. భౌతికంగా, మానసికంగా వారిని చిత్రహింసలకి గురిచేస్తారు. మరికొందరు సైకో భర్తలు అయితే భార్యను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అందంగా ఉంటమే ఆ మహిళ శాపమైందేమో. అనుమానాపు భర్త.. ఆ మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ చెందిన నాజ్(22) అనే యువతికి నాసిర్ హుస్సేన్ అనే యువకుడితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. బీటీఎం లేఔట్ పరిధిలోని తారవకెరెలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. నాజ్ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. అలానే బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతో ప్రేమగా ఉండేది. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో నాసిర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైన కొన్ని నెలల పాటు ఈ నవదంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అయితే నాజ్ అందంగా ఉండటంతో నాసిర్ కి మనస్సులో అనుమానం మొదలైంది. ఈక్రమంలో ఎవరితో మాట్లాడిన కూడా నాజ్ పై కోపం ప్రదర్శించే వాడు. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందని నిత్యం అనుమానించే వాడు. ఈ క్రమంలో ఆమె పక్కింటి వారితో మాట్లాడిన కూడా దారుణంగా హింసించే వాడు.
అయితే భర్తలో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అని నాజ్.. అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది. అతడి అనుమానం తగ్గకపోగా.. ఇంకా పెరిగి భౌతికంగా, మానసికంగా నాజ్ ను చిత్ర హింసలకు గురిచేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఆదివారం ఆమెతో మరోసారి గొడవ పడ్డాడు. ఆమెను గొంతు పిసికి దారుణంగా నాసిర్ హత్య చేశాడు. అనంతరం మృతురాలి సోదరుడికి ఫోన్ చేసి.. నీ చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు. దీంతో మృతురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. అనుమానం కారణంగా జరిగే ఇలాంటి దారుణ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.