భార్యభర్తల మధ్య గొడవలు అనేది సహజం. అయితే అవి పెద్దవిగా మారినప్పుడు కాపురంలో కల్లోలం ఏర్పడుతుంది. ఆర్థిక, మద్యం తాగడం వంటి కారణాలతో ఎక్కువగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొందరు భర్తలు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాన్ని పట్టించుకోరు. అంతేకాక డబ్బుల కోసం భార్యపిల్లలను వేధింపులకు గురిచేస్తుంటారు. ఈక్రమంలో కొందరు భార్యలను భర్తను హత్య చేయడం లేదా తాము ఆత్మహత్య చేసుకోవడం చేస్తుంటారు. తాజాగా ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది.
భార్యభర్తల మధ్య గొడవలు అనేది సహజం. అయితే అవి పెద్దవిగా మారినప్పుడు కాపురంలో కల్లోలం ఏర్పడుతుంది. ఆర్థిక, మద్యం తాగడం వంటి కారణాలతో ఎక్కువగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొందరు భర్తలు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాన్ని పట్టించుకోరు. అంతేకాక డబ్బుల కోసం భార్యపిల్లలను వేధింపులకు గురిచేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మహిళలు దారుణమైన నిర్ణయం తీసుకుంటారు. భర్తను హత్య చేయడమో లేదా తాము ఆత్మహత్య చేసుకోవడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలతో అభంశుభం తెలియని పిల్లలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా మద్యానికి బానిసగా మారిన తన భర్త వేధింపుులను తట్టుకోలే.. ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లిలో పందుల లక్ష్మి(35) అనే మహిళ శేఖర్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి హాసిని(6), అశ్విన్(4), ఆర్యవర్ధన్(2) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. శేఖర్ మద్యానికి బానిసగా మారి లక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడు. నిత్యం తాగి వచ్చి..పిల్లల ముందే లక్ష్మితో గొడవ పడేవాడు. ముగ్గురు పిల్లలను చూసి..భర్త వేధింపులను లక్ష్మి భరిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులతో లక్ష్మికి నరకం చూసింది. ఇలా కొంతకాలం భరిస్తూ వచ్చిన లక్ష్మి పేదరికం, భర్త వేధింపులకు జీవితంపై విరక్తి చెందింది. శనివారం రాత్రి లక్ష్మి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకొంది.
లక్ష్మిని గమనించిన స్థానికులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం అక్కడే చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఆరేళ్లలోపు చిన్నారులే. తల్లి కోసం ఎదురు చూస్తున్న చిన్నారులను చూసిన బంధువులు రోదించిన తీరుతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తాళ్లగురిజాల ఎస్సై నరేష్ తెలిపారు. నిత్యం ఎందరో మహిళలు కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో తమతో పాటు పిల్లలను చంపేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల పరిష్కారానికి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.