సంసారం అనేది ఓ చదరంగం లాంటిది. ఇందులో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. అయితే కొందరు భార్యాభర్తల మధ్య చిన్నగొడవలు సహజమే. అయితే కొందరు దంపతులు నిత్యం గొడవలు పడుతూ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ గొడవల్లో భార్యభర్తల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ దంపతుల మధ్య జరిగిన గొడవ..కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భర్త ఆత్మహత్య చేసుకోగా.. ఆ మనస్తాపంతో చిన్నారిని చంపి.. భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం బెళగావిలో మారుతి(25), వాసంతి(22) అనే భార్యభర్తలు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి పాపకు మూడున్నర ఏళ్లు. ఇంకో పాపకు ఏడాదిన్నర ఉంటాయి. అయితే కొన్నాళ్ల పాటు హాయిగా సాగిన వారి కాపురంలో కొంతకాలం నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మారుతి గురువారం మద్యం తాగి వచ్చివాసంతితో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ తీవ్ర స్థాయికి వెళ్లింది. కొప్రోద్రిక్తుడైన మారుతి ఆవేశంలో విషం తాగేశాడు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందతూ శుక్రవారం ఉదయం మరణించాడు. మారుతితో ఎన్ని గొడవలు పడిన అతడిపై వాసంతికి ప్రేమ ఉండేది. భర్త మృతితో మనస్తాపానికి గురైన వాసంతి.. తన ఏడాదిన్నర పాపను తీసుకుని ఊరి బయట ఉన్న తమ పొలంలోకి వెళ్లింది. అక్కడే తన చిన్న కుమార్తె గొంతుకోసి హత్య చేసింది. అనంతరం తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతురాలి పెద్ద కుమార్తె ఆడుకోవడం కోసం బయటకి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని చంపడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.