వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో ఓ భర్త భార్యపై అమానుష చర్యకు దిగాడు. విడాకులు అడిగినా ఇవ్వకపోవటంతో ఆమె కళ్ల ముందే దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్తాన్‌లోని నాగౌర్ పట్టణానికి చెందిన హరేంద్ర సింగ్ అనే ఓ డాక్టర్‌కు రూపా తల్వార్ అనే యువతితో 12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం హరేంద్ర డాక్టర్‌గా ఉంటున్న క్లినిక్‌లో కీర్తి అనే యువతి నర్సుగా చేరింది. కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త వివాహేతర సంబంధం విషయం రూపకు తెలిసింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగటం మొదలయ్యాయి. హరేంద్ర భార్యకు విడాకులు ఇచ్చి కీర్తితో కలవాలని భావించాడు. విడాకులు ఇవ్వాలని భార్యపై ఒత్తిడి తేసాగాడు. ఆమె ఒప్పుకోలేదు. ఓ రోజు కీర్తిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. విడాకులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఒప్పకోకపోవటంతో బాగా కొట్టాడు. అనంతరం భార్య కళ్ల ముందే కీర్తితో శృంగారంలో పాల్గొన్నాడు. ఇది చూసి భరించలేకపోకపోయిన రూప అక్కడినుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులను వెంట బెట్టుకుని పోలీసులను ఆశ్రయించింది. భర్తపై కేసు పెట్టింది. గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి