ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పే కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అలాంటి వాళ్ల నిజస్వరూపం తెలుసుకునే లోపే జీవితం సర్వనాశంమై పోతుంది. కొందరు యువతులు నష్టం జరిగే లోపు మెల్కోన్ని మోసగాళ్ల ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లైన వ్యక్తి తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమపేరుతో ఆ బాలికను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఆ బాలిక వారి నుంచి తప్పించుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్టకు చెందిన కంసాని రాజేష్ కు వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే ఓ మైనర్ బాలిక(16)పై కన్నుపడింది. కొద్ది రోజులుగా ఆ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. సదరు బాలిక కూడా రాజేష్ పూర్తిగా నమ్మింది. తనకు పెళ్లైన సంగతిని దాటి పెట్టిన రాజేష్.. ఈ బాలికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ క్రమంలో ఏవో మాయ మాటలు చెప్పి గత నెల 22న రాత్రి కారులో బాలికను యదగిరి గుట్ట తీసుకెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు రాజేష్. అతడి తన బంధువులు అవినాష్, వినోద్ సహాయం చేశారు.
ఆ లాడ్జిలో ఆ బాలికకు మద్యం తాగించి.. మైకంలో ఉన్న ఆమెను లోబర్చుకున్నాడు.అనంతరం ఈ ప్రాంతంలోనే రాజేష్ బంధువు సిరి అనే మహిళ వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశాడు.అప్రమత్తమైన ఆ బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. బాలిక ఫోన్ కు స్పందించిన పోలీసులు బాలిక కాపాడినారు. రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేశారు.గత నెలలో బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.