తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన విషయం తెలిసిందే. ఇలా ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన విషయం తెలిసిందే. ఇలా ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇక ఫెయిల్ అవ్వుతామోననే భయంతో కూడా కొంతమంది విద్యార్థులు ఫలితాలు విడుదల అవ్వకముందే బలవన్మరణం చేసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ఇంటర్ విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఉండే శాంతకుమారి అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. రాయదుర్గంలోని ప్రభుత్వ కాలేజీలో శాంతకుమారి చదువుతోంది. ఇటీవలే విడుదలైన ఫలితాల్లో ఆ యువతి ఫైయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంత కుమారి.. ఐదో అంతస్తు నుండి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భవనంపై నుంచి దూకడంతో ఆ యువతికి తీవ్ర గాయలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాంతకుమారి మృతి చెందింది. ఆ యువతి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పరీక్షలే జీవితం కాదని, తొందర పాటుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకొత మిగల్చవద్దని కొందరు అంటున్నారు. మరి.. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.