తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని దేవుడే సృష్టించి మనల్ని వారితో కలిపిస్తాడు. అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను కలిగించే మాట స్నేహం. ఎవరైన మంచి స్నేహితులను సంపాందిచుకుని భద్రంగా కాపాడుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ నేటికాలంలో కొందరు స్నేహానికి మాయని మచ్చ తెస్తున్నారు. నమ్మిన స్నేహితుడిని నట్టేటా ముంచేస్తున్నారు. స్నేహితుడి గెలుపును చూసి సంతోష పడాల్సిన వాళ్లు.. అసుయాతో అతడి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా కోటి రూపాయలు గెలుచుకున్న ఓ యువకుడిని డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ చేసి.. అతడి తండ్రిని బెదిరించారు. చివరికి జైలు పాలయ్యారు. ఈ ఘటన కర్నటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రంలోని హుబ్లి జిల్లాకు చెందిన గరీబ్ నవాజ్ అనే యువకుడు ఇటీవల ఒక ఆన్ లైన్ గేమ్ లో కోటి రూపాయలకు పైగా డబ్బు గెలుచుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. అయితే నవాజ్ ను అభినందించి, మంచి పార్టీ చేసుకోవాల్సిన అతడి స్నేహితులు అసుయా పెంచుకున్నారు. స్నేహితుడి డబ్బు కోసం ఆశపడ్డారు. నవాజ్ నుంచి ఎలాగైన డబ్బులు కాజేయాలని పథకం వేశారు. తమ ఏడేళ్ల స్నేహాన్ని మరచి ఏడుగురు యువకులు.. నవాజ్‌ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవాజ్ తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే నవాజ్ ని చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ నవాజ్ తండ్రి రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే రూ.15 లక్షలు ఇచ్చిన తన కొడుకును ప్రాణాలతో వదిలేస్తారని అతడికి నమ్మకం కుదరలేదు.
దీంతో పోలీసులుకు ఫిర్యాదు ఇచ్చాడు. నవాజ్ ఫిర్యాదును పోలీసులు నవాజ్‌ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు పోలీసులు నవాజ్‌ను కిడ్నాప్ చేసిన ప్రాంతాని గుర్తించారు. అక్కడి నుంచి నవాజ్ ను పోలీసులు రక్షించారు. అతడి స్నేహితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ ఆరిఫ్, ఇమ్రాన్, అబ్దుల్ కరీం, హుస్సేన్ సాబ్, ఇమ్రాన్ ఎమ్, తౌఫిఫ్, మొహమ్మద్ రజాక్‌గా గుర్తించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.