ఈ మధ్యకాలంలో ఛార్జీంగ్ పెట్టిన మొబైల్, ల్యాప్ టాప్ లు పేలిపోతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలా ఎలక్ట్రానికి వస్తువులు పేలిన సమయంలో కొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కడప జిల్లాలో సుమలత అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ ఛార్జీంగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్ టాప్ పేలింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమలత మృతి చెందింది.
గతంలో జరిగిన వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తోంది. ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్న కారణంగా ల్యాప్ టాప్ కు ఛార్జీంగ్ పెట్టి.. ఆఫీస్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ల్యాప్ టాప్ బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడే ఉన్న సుమలత ఒళ్లంతా బొబ్బలెక్కి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కడప ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అమె పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం తిరుపతిలోని ఓ ప్రైయివేటు ఆసుపత్రి చేర్చాగా.. చికిత్స పొందుతు మృతి చెందింది. ఛార్జింగ్ పెట్టి పని చేయడం ప్రమాదకరమని ఈ ఘటన వార్నింగ్ ఇస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.