చిన్న వివాదం యువకుల మధ్య చిచ్చు రేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన వారు ఒకరిపై ఒకరు పిడుగుద్దుల దాడి చేసుకునేలా చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలోని ఓ ప్రవేటు కాలేజీ తరగతి గదిలోనే విద్యార్ధులు కొటుకున్నారు. క్రికెట్ మ్యాచ్ విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టింది. క్రికెట్ ఆడుతుండగా చిన్న వివాదం చోటుచేసుకుంది. అక్కడ మాటకు మాట పెరిగి చివరకి కులం పేరుతో పరస్పరం విద్యార్ధులు దూషించుకున్నారు. ఇది కాస్తా ముదిరి కాలేజీ తరగతి గదిలోనే విద్యార్ధులు కొట్టుకున్నారు. గొడవపడుతున్న విద్యార్ధులను పక్కన వారు ఎంత అడ్డుకున్నా లెక్కచేయలేదు. అడ్డుకున్న వారిని సైతం పక్కకు నెట్టి దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్ధులకు గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థులందరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.