ఆ యవతికి చదువంటే ప్రాణం.. ఎలాగైనా ఉద్యోంగ సాధించి తల్లిదండ్రులకు చేదోడు వాదోడు కావాలనుకుంది. డిగ్రీ పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేరింది. కొండంత ఆశలతో కూతుర్ని అక్కడకు పంపిన తల్లిదండ్రులకు షాకింగ్ వార్త తెలిసింది. ఏమైందో ఏమో తెలీదు గానీ, తమ కుమార్తె విగతజీవిగా తిరిగొచ్చింది. పోలీసులకే ఈ కేసు పెద్ద సవాలు విసురుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వి.కోట మండలం అరిమాకుల గ్రామానికి చెందిన అనితా రెడ్డి గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటానని కోరింది. అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ కోచింగ్ వల్ల కలిగే లాభాలను వారికి విరించింది. కూతురి పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా అందుకు సరే అన్నారు. అయినా కూతురు ఒక్కదాన్ని పంపేందుకు చాలా ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రం కావడంతో ధైర్యంగా పంపారు.
రెండు నెలల క్రితం తిరుపతి రూరల్ మండలం తాడితోపు సమీపంలోని కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణా కేంద్రంలో చేరింది. ఆ శిక్షణా కేంద్రంలోనే హాస్టల్ వసతికూడా ఉండటంతో అక్కడే బస చేసేది. అనితతోపాటు ఇంకో 18 మంది యువతులు, 10 మంది యువకులు ఒకే భవంతిలో ఉండేవారు. శనివారం తోటి విద్యార్థినులతో క్లాస్ కి వెళ్లిన అనిత వసతిగృహానికి తిరిగి వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో బాత్ రూమ్ కు వెళ్లింది. అనిత కోసం ఆమె స్నేహితురాళ్లు మెస్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి అనిత రాలేదు. పైకి వెళ్లి బాత్ రూమ్ డోర్ కొట్టి చూశారు. ఎంతకీ అనిత స్పందించకపోవడంతో వాళ్లు డోర్ ను బద్దలు కొట్టారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ సరయు అరెస్టు.. పోలీసుల అదుపులో బోల్డ్ బ్యూటీ
లోపల అనిత అచేతనంగా పడి ఉంది. వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనితను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిత గది, బాత్ రూమ్ లో క్లూస్ సేకరించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది ఆత్మహత్య? హత్యా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అనిత మృతి వార్త విన్న తల్లిదండ్రులు ఆమెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.