కొంత మంది దృష్టిలో పెళ్లి అంటే అదేదో చిన్నప్పుడు ఆడుకునే బొమ్మల పెళ్లి అనే భావన కనిపిస్తోంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. వద్దనుకుంటే కట్టుకున్న వారిని గాలికి వదిలేయచ్చు అనుకుంటున్నారు. అలాంటి అన్యాయం జరిగినప్పుడు చాలా మంది తమలో తాము బాధపడుతూ ఉండిపోతారు. కొందరు మాత్రం రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తారు. అలా ఓ యువతి భర్త ఇంటి ముందు కూర్చొన దీక్ష చేపట్టింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఓ యువతి తనకు న్యాయం చేయాలంటూ రామచంద్రన్ అయే వ్యక్తి ఇంటి ముందు దీక్షకు దిగింది. చెన్నైకి చెందిన శ్రీదేవి నారాయణవనంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తోంది. అదే కళాశాలలో రామచంద్రన్ కూడా బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రామచంద్రన్ కమ్యూనిటీ పోలీసుగా కూడా పనిచేసేవాడు. ఆ తర్వాత అతను హోంగార్డుగా సెలెక్ట్ అయ్యాడు. గతేడాది మార్చిలో శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తిరుపతిలో కాపురం కూడా పెట్టాడు.
ఆమెను మాత్రం అత్తగారింటికి తీసుకెళ్లలేదు. ఇంట్లో వాళ్లను ఒప్పించి తీసుకెళ్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన శ్రీదేవి.. భర్త ఎప్పుడు తీసుకెళ్తాడా అంటూ ఎదురు చూస్తోంది. సమయం చూసుకుని మూడు నెలల క్రితమే తనకు పెళ్లైందని రామచంద్రన్ తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత వాళ్లు తమ నిర్ణయం చెప్పారు. నువ్వు మేం చూసిన పిల్లనే పెళ్లి చేసుకోవాలంటూ అతడిని ఒత్తిడి చేశారు. ఆ తర్వాత క్రమంగా అతని నుంచి కమ్యూనికేషన్ తగ్గిపోయింది. ఇంట్లో ఉండటానికి ఖర్చు ఎక్కువైందని శ్రీదేవి హాస్టల్ కు మారిపోయింది.
ఇదీ చదవండి: కన్న కూతురిని కిరాతకంగా హత్య చేసిన కసాయి తల్లి
అతడికి మరో వివాహం చేస్తున్నారనే వార్త విని నీతి నిజాయితీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసింది. తనకు న్యాయం చేయాలని కోరుకుంది. ఆ పార్టీ మహిళా విభాగం వెళ్లి భర్త ఇంటి ముందు దీక్షకు దిగారు. తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీదేవి ఆరోపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడుకు చేరుకుని శ్రీదేవికి న్యాయం చేస్తామని మాటిచ్చారు. పోలీసుల హామీతో శ్రీదేవి దీక్షను విరమించుకుంది. రామచంద్రన్ తల్లిదండ్రులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.