ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. కొంతమంది ప్రేమ పేరుతో వేధిస్తూ యువతులను లైంగికంగా వేధిస్తుంటే.. మరికొంతమంది ఉన్మాధులుగా మారి వారిని హతమారుస్తున్నారు.
ఇటీవల మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వం నిర్భయ, దిశా లాంటి చట్టాలను తీసుకు వచ్చినా.. వీరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ వెంటపడిన యువకుడు చివరికి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కొండమిట్ట ప్రాంతంలో ఓ బ్యూటీపార్లర్ లో పనిచేస్తుంది ప్రశాంతి అనే యువతి. కొంత కాలంగా ఆమెను చక్రవర్తి అనే యువకుడు ఆమె వెంటపడి వేధించసాగాడు. ఆమె అతన్ని తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఉన్మాదిగా మారిన చక్రవర్తి ప్రశాంతి పని చేస్తున్న బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఆమెపై దాడి చేసి.. తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయంతో ప్రశాంతి అక్కడిక్కడే మృతి చెందింది.
రక్తపు మడుగులో పడి ఉన్న ప్రశాంతిని చూసి భయంతో చక్రవర్తి తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రశాంతి మృతదేమాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కొనఊపరితో ఉన్న చక్రవర్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నింధితుడు చక్రవర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.