కొందరు వ్యక్తులను మృగాలు అని కూడా అనలేం. ఎందుకంటే వాళ్లని చూసి ఆ మృగాలు కూాడా సిగ్గు పడతాయోమే? ఆడవాళ్ల మీద మాత్రమే కాదు.. అభంశుభం తెలియని అమ్మాయిలు, చిన్నారులపై కూడా ఎక్కడోచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణగా మరో ఘటన వెలుగు చూసింది.
ఆడవాళ్లపై అకృత్యాలు, అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వావీవరసలు లేకుండా కామంతో రంకేలేసే నీఛులు ఎక్కువైపోయారు. తమ కోరిక తీర్చుకునేందుకు ఎవరైనా పర్లేదు, ఎంత వయసైనా పర్లేదు అన్నట్లు మరీ మృగాల్లా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇలాంటి నీఛులతో పోలిస్తే మృగాలు కూడా సిగ్గు పడతాయోమే? పెళ్లాం గర్భవతి అయ్యిదని.. తన కామ కోరికలు తీర్చుకునేందుకు అన్న కుమార్తెను చెర పట్టాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి మరీ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని కూడా చేశాడు.
ఈ ఘోరం చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. నాగరాజు అనే వ్యక్తి భార్యాపిల్లలతో జీవిస్తున్నాడు. అతని భార్య మళ్లీ గర్భం దాల్చడంతో అతని కామం తీర్చుకునేందుకు వేరే మార్గం కోసం వెతికాడు. అయితే అతని కన్ను అన్న కుమార్తెపై పడింది. ఆమెను రోజూ స్కూలుకు తీసుకెళ్లడం, ఇంటికి తీసుకురావడం చేస్తున్నాడు. వచ్చే దారిలో అమ్మాయికి తినుబండారాలు కొనిపించడం చేయసాగాడు. ఓరోజు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించాడు.
బాబాయ్ నిజంగానే అమ్మానాన్నను చంపేస్తాడేమో అని ఆమె మౌనం వహించింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకంటే అదే అదునుగా నాగరాజు ఆ అమ్మాయిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడం ఆమెపై తన కామం తీర్చుకోవడం చేశాడు. అయితే కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. అలా చెబితే చంపేస్తానన్నాడు. భయంతో అమ్మాయి ఎవరికీ చెప్పుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
వైద్యులు అమ్మాయికి పరీక్షలు నిర్వహించారు. తర్వాత అమ్మాయి 8 నెలల గర్భవతి వైద్యులు స్పష్టం చేశారు. బాలికను నిలదీయగా.. అసలు విషయం చెప్పింది. వెంటనే నాగరాజును పట్టుకుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా అతను గ్రామంలో ఉన్న పులువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అతనిపై కేసులు కూడా ఉన్నాయంటూ చెబుతున్నారు. అయితే అలాంటి దుర్మార్గుడితో కన్న కూమార్తెను ఎలా పంపారంటూ నెటిజన్స్ అమ్మాయి తల్లిదండ్రులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన ఈ నీఛుడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.