వివాహేతర సంబంధాలకు వయసు, వావివరసలు అడ్డురావడం లేదు. ఆ బంధమే అనైతికం అయినప్పుడు ఇంక కండిషన్స్ ఏంటి అంటారా? అది కూడా నిజమే కదా. అయితే ఎక్కువ శాతం నేరాలు వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ వివాహేతర సంబంధం గురించే. పెళ్లయ్యి, 17 ఏళ్ల కొడుకు ఉండి కూడా.. పరాయి వ్యక్తితో పక్క పంచుకుంది. కొంతకాలానికి కోరిక తీర్చిన యువకుడే కాల యముడయ్యాడు. కోరిక తీర్చకపోతే రేప్ కేస్ పెడతానన్నందుకు కాటికి పంపాడు. విచారణ చేయగా అతడు విస్తుపోయే నిజాలు బయటపెట్టాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన 17 ఏళ్ల బాలుడు తల్లి కనపడట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఊరు వెళ్తున్నా అని వెళ్లిన తల్లి తిరిగిరాలేదని. ఊరు కూడా చేరుకోలేదని ఫోన్ వచ్చిందని చెప్పాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీఫీ ఫుటేజ్ ఆధారంగా ఓ యువకుడిని విచారణకు పిలిచారు. దర్యాప్తులో ఆ యువకుడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఓరోజు గుడిలో మహిళకు ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆ మహిళ తన కోరికలు తీర్చుకునేందుకు ఆ యువకుడిని వాడుకునేది. ఆమె తనని ఒక మనిషిలా కాకుండా ఒక బానిసలా చూసేదని, ఎప్పుడు అంటే అప్పుడు తన కామవాంఛ తీర్చుకునేదని ఆరోపించాడు. అంతేకాకుండా వృత్తిరీత్యా అతనికి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదన్నాడు. అలా వెళ్తే తనపై రేప్ కేసు పెడతానని బెదిరించిందని తెలిపాడు. ఆమె నుంచి తప్పించుకోవడానికి ఇంక వేరే దారిలేక హత్య చేసినట్లు అంగీకరించాడు. ఊరు వెళ్లడానికి బస్టాప్ లో వేచి ఉన్న మహిళను బైక్ పై ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వాటర్ హీటర్ వైర్లను వాటికి చుట్టి.. ఓ భార్య దారుణం!