టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఈ సదుపాయాన్ని అందిపుచ్చుకుంటుంటే కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదే కాకుండా కొంతమంది లేడీస్ బాత్రూమ్ లలో సీసీ కెమెరాలు అమర్చుతూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే చేయబోయాడు చత్తీస్‌ఘడ్ లోని ఓ లేడీస్ హాస్టల్ ఓనర్. అసలు విషయం బయటకు పొక్కడంతో చివరికి ఆ గుర్మార్గుడు కటకటాలపాలయ్యాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భిలాయ్ లోని ఆశీష్ నగర్ కు చెందిన ఫగన్ లాల్ అనే వ్యక్తి ప్రైవేట్ హాస్టల్ ను నడిపిస్తున్నాడు. దీంతో దూరం నుంచి వచ్చే కొంతమంది డిగ్రీ, పీజీ చదివే అమ్మాయిలు ఆ హాస్టల్ లో ఉండి చదువుకునేవారు. ఈ క్రమంలో ఆ హాస్టల్ ఓనర్ ఫగన్ లాల్ అమ్మాయిలపై కన్నేసి ఏకంగా హాస్టల్ బాత్రూమ్ లలోనే సీసీ కెమెరాలను అమర్చాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇలా చాలా కాలంగా రహస్యంగా వీడియోలు తీస్తూ దారుణానికి పాల్పడేవాడు. కొంత కాలంగా సాగించిన ఈ గుట్టను ఎట్టకేలకు కొందరు అమ్మాయిలు బయపెట్టి హాస్టల్ ఓనర్ బాగోతాన్ని స్థానిక పోలసులకు ఫిర్యాదు చేశారు. ఫగన్‌లాల్ పవార్ ని అరెస్ట్ చేసిన పోలీసులు సెక్షన్ 354, 66Eకింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.