ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే తీవ్రమైన మనస్థాపానికి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి.
ఈ మద్యకాలంలో చాలామంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపాని గురి అవుతూ.. ఎన్నో అనర్థాలకు పాల్పపడుతున్నా. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు కారణాలు ఏవైనా తీవ్ర ఒత్తిడికి లోనై క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాల్లో విషాదాలో చోటు చేసుకుంటున్నాయి.. పిల్లలు అనాథలు అవుతున్నారు. తాజాతా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన మల్టీలెవెల్ పార్కింగ్ టెర్మినల్ పై నుంచి దూకి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పపడింది. ఆత్మహత్య చేసుకున్న మహిళ ఐశ్వర్య(35) గా పోలీసులు గుర్తించారు. పీఎస్-2 మూవీ వీక్షించేందుకు తన ఇద్దరు పిల్లలతో పల్లావరం సమీపంలోని పులిచ్చలూరు కి చెందిన బాలాజీ భార్య ఐశ్వర్య వచ్చారు. సినిమా మద్యలోనే బయటకు వచ్చి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. హఠాత్తుగా పై నుంచి ఎవరో కింద పడ్డ విషయం గమనించిన పార్కింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఐశ్వర్య కొట్టుమిట్టాడుతుంది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను వెంటనే క్రోంపేట హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు.
తల్లి మరణించి విషయం తెలియని కూతురు, కొడుకు థియేటర్లో సినిమా చూస్తూ ఉండిపోయారు. మూవీ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి తల్లి కోసం వెతికినా కనిపించకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. పిల్లలను పోలీసుల సంరక్షణలో ఉంచుకున్నారు. పోలీసు విచారణలో మృతురాలి భర్త బాలాజీ అమెరికాలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుండగా.. ఐశ్వర్య తన పిల్లలతో ఇక్కడే ఉంటుంది. గత కొంత కాలంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో ఉంటుందని బంధువులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.