ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అవకాశం వస్తే అత్యాచారం చేయడం, నిరాకరిస్తే కోరికలు తీర్చుకుని చివరికి హత్యలకు పూనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏకంగా సొంత తండ్రులు కూడా కూతుళ్లపై కనికరం లేకుండా ప్రవర్తిస్తూ సభ్య సమాజాన్ని భయందోళనలకు గురి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఐదవ తరగతి బాలిక సొంత తండ్రిచేతిలోనే అత్యాచారానికి గురి కావాల్సి వచ్చింది. తాజాగా చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్యతో పాటు పదేళ్ల కూతురితో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తన భార్య పని నిమిత్తం బయటకు వెళ్లడంతో తాగిన మైకంలో తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఒంటరిగా తన కూతురుపై కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక రాత్రి అయ్యాక ఇంటికొచ్చిన తల్లికి కూతురు తండ్రి చేసిన దారుణాన్ని వివరించే ప్రయత్నం చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.దీంతో కోపంతో ఊగిపోయిన భార్య వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కన్న కూతురుపై తండ్రి కనికరం లేకుండా బరితెగించి ప్రవర్తించిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.