సభ్య సమాజం తల దించుకునే అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఆ నాడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం కంటే వందరెట్లు ఎక్కువగా ఇక్కడ ఈ మహిళను అవమానించారు. ఛీ వీళ్లు అసలు మనుషులేనా? అని ఛీదరించుకునేలా వ్యవహరించారు. అత్త, మామ, భర్త ఆ మహిళ వ్యక్తిత్వంపై వేసిన ముద్ర ఆమె జీవితాన్ని నగుబాలు చేసింది. అత్తింట్లోనే ఉంటున్నా కూడా ఆమె క్యారెక్టర్ పై ముద్రవేసి ఊరంతా కలిసి ఆమెను దుర్భాషలాడుతూ ఊరేగించారు. ఊర్లో ఉన్న కుర్రాళ్లంతా ఆమె జుత్తు కత్తిరించి, ముఖానికి మసి, సున్నం పూసి చెయ్యి పట్టుకుని ఓ పశువును లాక్కెళుతున్నట్లుగా ఊరంతా తిప్పారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ అమానవీయ ఘటన బిహార్ రాష్ట్రం దర్బాంగలో జరిగింది. రణ్ వీర్ సదా అనే వ్యక్తి ఓ మహిళను వివాహమాడాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే భార్యతో సరిగా ఉండటం లేదు. ప్రవర్తన నచ్చలేదు అంటూ.. ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఆ విషయాన్ని కుటుంబంతో చెప్పాడు. అప్పటి నుంచి కుటుంబం మొత్తం ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు కొన్నాళ్లకు విషయం పెద్దల ముందు పెట్టాడు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు నేను ఆమెతో కాపురం చేయను అని తెగేసి చెప్పాడు. ఆ పంచాయతీలోని పెద్దలు కూడా రణ్ వీర్ సదా మాటలే నమ్మారు. ఆ మహిళ మంచిది కాదు అని ముద్ర వేశారు.
ఆ ముద్ర వేయడంతో ఊర్లో ఉన్న కుర్రాళ్లంతా కలిసి ఆమెను ఘోరంగా అవమానించారు. ఆమెకు దేహశుద్ధి చేశారు. ఆమె జుత్తు కత్తిరించారు. ముఖానికి మసి, సున్నం రాశారు. ఆమె ఓ మహిళ అని కూడా మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఊర్లోని వారంతా ఇష్టమొచ్చినట్లు తిట్టారు, కొట్టారు. కుర్రళ్లు ఆమె చేయి పట్టుకుని ఊరంతా ఊరేగించారు. దారి పొడవునా ఆమెను దుర్భాషలాడుతూనే ఉన్నారు. ఈ మొత్తం ఘటనను ఆ భర్త, అత్త, మామ అందరూ చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఆ ఘోరాన్ని మొత్తం వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: కామ కోరికలతో యువకుడిని బానిసలా మార్చుకున్న ఆంటీ!
ఓ మహిళ క్యారెక్టర్ ను తప్పుబట్టడమే కాకుండా.. ఆమెను ఇంతటి దారుణంగా అవమానించడం, ఊరేగించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన ఏ ఒక్కరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల నుంచి గ్రామ పరిపాలన అధికారుల వరకు అందరికీ ఈ ఘటనపై సమాచారం ఉంది. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆ ఘోరాన్ని ఆపలేదు. బాధ్యులకు ఎలాంటి శిక్ష విధించలేదు. గ్రామస్తులు కూడా మహిళను అంత ఘోరంగా అవమానిస్తుంటే అడ్డుకోకపోగా.. చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వీడియో ఆధారంగా బాధ్యులు, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఆ మహిళకు న్యాయం జరగకపోతే పరిణామాలు తీవ్రంగా మారుతాయంటూ హెచ్చరించారు.
ఒక ఆడకూతురికి అంతటి అవమానం చేసిన భర్త, అత్త, మామ, ఆ ఊరి కుర్రాళ్లు, పంచాయతీ పెద్దలు, చోద్యం చూసిన గ్రామస్తులు, పట్టించుకోని అధికారులు వీళ్లందరికీ ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.