భర్త ప్రవర్తన నచ్చక వివాహిత ఆత్మహత్య, భర్త వేధింపులు భరించలేక భార్య సూసైడ్ ఇలాంటి హెడ్డింగ్ లతో మనం అనేకమైన ఘటనలు చూశాం. కానీ బీహార్‌లో మాత్రం ఈ కథనాలకు విరుద్దంగా జరిగింది. విషయం ఏంటంటే..? అది బీహార్‌లోని భగల్‌పూర్ పరిధిలోని బిగుసరై ప్రాంతం. రణ్‌ధీర్ అనే యువకుడు రాధ అనే యువతిని 2018లో వివాహం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రణధీర్ అందమైన భార్యను పెళ్లి చేసుకున్నానని మురిసిపోయాడు.
కానీ ఈ సంతోషంగా వెనుక వేధింపులు దాగున్నాయని రణధీర్ గ్రహించలేకపోయాడు. అయితే కొంత కాలం వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. ఇక రోజులు గడుస్తున కొద్ది భార్య రాధ భర్తను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టింది. రాను రాను భార్యతో పాటు, అత్తింటి వాళ్లు కూడా వేధింపులకు గురి చేశారు. కొంత కాలం మాములే అనుకున్న రణధీర్ కు వేధింపులు తట్టుకోలేనంతంగా మారిపోయాయి. ఓ రోజు భార్య రాధ తన భర్తతో గొడవ పడింది. రణధీర్ కు మాటకు మాట జవాబిచ్చింది. దీంతో ఉన్నట్టుండి భార్య నువ్వు నాకు అవసరం లేదని, విడాకులు కావాలంటూ తెగేసి చెప్పింది. దీనికి అత్తింటి వాళ్లు కూడా వత్తాసు పలకడంతో రణధీర్ తట్టుకోలేకపోయాడు.
భరించలేని దుక్కాన్ని దిగమింగుకోలేకపోయాడు. తీవ్ర భావేద్వేగానికి లోనైన రణధీర్ ఓ రోజు తన ఇంట్లో అర్థరాత్రి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రణధీర్ తల్లిదండ్రులు కోడుకు కోసమని ఫోన్ చేశారు. ఎంతకు కూడా రణధీర్ నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే రణధీర్ కుటుంబ సభ్యులు అతనుంటున్న ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఫ్యాన్ కు ఊరేసుకుని వేలాడుతు కనిపించాడు. విగతజీవిలా వెలాడుతూ కనిపించిన కోడుకుని చూసిన తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇలా కొందరి భార్యల తీరు హద్దులు దాటుతుండడంతో భరించలేని భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకమువుతన్నాయి.