ఈ మద్య దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామంతో రగిలిపోయే మృగాళ్లు అవేవీ పట్టించుకోవడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్లో దారుణం జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. విశ్రాంతి తీసుకునేందుకు చోటు ఉందని తీసుకెళ్లిన ఓ కిరాతకుడు బాధితురాలు నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి 15 మంది చిరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది చదవండి: రైల్వే పట్టాలపై బాలిక… స్పీడ్ గా వస్తున్న గూడ్స్ రైల్.. అంతలోనే ఓ వ్యక్తి
యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కుర్చునేందుకు సీటు దొరకలేదు. చాలా సేపటి వరకు నిలబడి ఉన్నది గమనించి ఓ యువకుడు వంటచేసే బోగీలో ఖాళీ స్థలం ఉందని, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చని యువతిని నమ్మించి తీసుకెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న ఆ యువతిపై అత్యాచారాం చేశాడు. రేప్ పై సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన భోపాల్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. వంటచేసే బోగీ వద్దకు వెళ్లగా అందులో ఉన్న వారు డోర్ ఓపెన్ చేయలేదు.
ఇది చదవండి: ఉత్తరాఖండ్లో భూకంపం… భయంతో జనం పరుగులు!
పోలీసులు ఒత్తిడి చేశాక అరగంట తర్వాత తలుపులు తెరిచారు. అప్పటికే ఆ యువతి పూర్తిగా అపస్మాకర స్థితిలో పడి ఉంది. ఏమీ మాట్లాడలేకపోయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆస్పత్రిలో కోలుకున్న ఆ యువతి ఏం జరిగిందో పోలీసులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 15 మంది చిరువ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అసలు నిందితుడిని గుర్తించేందుకోసం వారిని విచారించనున్నట్లు చెప్పారు.