సమాజంలో భార్యపై భర్త దాడులు, భర్తపై భార్య దాడులు, ఒకరిపై ఒకరు హత్యాయత్నాలు, ఒకరి అంతం చూడాలని మరొకరు పాకులాడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భర్త చేసిన దారుణం చూసి అందరూ షాకయ్యారు. భార్యపై దాడి చేయడమే కాకుండా.. విచక్షణారహితంగా ఆమెపై సలసల కాగుతున్న నూనె పోశాడు. అడ్డొచ్చిన కుమార్తెపై కూడా దాడి చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. బెగళూరు అడుగోడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్‌ఆర్ నగర్ లో ఏండ్ల థామస్, ఆంటోనియమ్మ దంపతులు నివాముంటున్నారు. వారికి కుమార్తె కూడా ఉంది. కారణం ఏంటని స్పష్టంగా తెలియదు గానీ, జనవరి 31న థామస్- ఆంటోనియమ్మను హత్య చేసేందుకు యత్నించాడు. పొయ్యిపై వేడినీళ్లు కాగబెడతానంటూ చెప్పిన థామస్.. పెనం పెట్టి నూనె కాయడం మొదలు పెట్టాడు.
అంతకంటే ముందే ఆంటోనియమ్మ తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే పరుగున వెళ్లి వంటగదిలోని వేడి నూనెను తెచ్చి ఆంటోనియమ్మపై పోశాడు. ఆమె కేకలు వేయడంతో వాళ్ల కుమార్తె ఉలిక్కి పడి లేచింది. తల్లిని రక్షించుకునేందుకు థామస్ తో ఆమె ప్రతిఘటించింది. కూతురిపై కూడా థామస్ వేడి నూనె పోశాడు. ఇద్దరూ కేకలు వేయడంతో పొరుగు వారు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లు వెంటనే రావడంతో థామస్ అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఆంటోనియమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు థామస్ ఎందుకు హత్య చేయాలని చూశాడనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కన్నతల్లే కర్కశంగా ఇద్దరు చిన్నారులను..