నేటి సమాజంలో అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాలను పాడు చేస్తున్నాయి. పెద్దల సాక్షిగా వివాహబంధంతో ఒక్కటైన జంట కొద్ది కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా విడిపోతున్నారు. అక్రమ సంబంధాలతో మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మారి తమ జీవితం చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అభం శుభం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు.
ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఆనందంగా సాగు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెద్దల సమక్షంలో నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వివాహబంధంతో ఒక్కటైన జంట కొద్ది కాలంలోనే విడిపోతున్నారు. దీనికి ముఖ్యకారణం వివాహేతర సంబంధాలు. అందంగా సాగుతున్న జీవితం.. ముత్యాల్లాంటి పిల్లలు.. అయినా శారీరక సుఖం కోసం పచ్చని సంసారాలు ఛిద్రం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఏ మహిళ తన భర్త పరాయి స్త్రీతో ఊహించుకోదు.. అలాగే ఏ భర్త కూడా తన భార్య పరాయి మగాడితో చనువుగా ఉండటం భరించలేదు. తన భార్య పరాయి వ్యక్తితో కాపురం పెట్టిందనన్న కక్ష్యంతో ఆమెను దారుణంగా చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కోల్‌కతాకు కు చెందిన తబ్సీన్ బేబి కి 14 ఏళ్ల క్రితం టైలరింగ్ చేసే షేక్ సుహేల్ తో వివాహం జరిగింది. వీరి జంట ఎంతో సంతోషంగా జీవిస్తుంది.. దంపతులకు ఇద్దరు పిల్లలు. బతుకుతెరువు కోసం తన భార్యతో షేక్ సుహేల్ బెంగుళూరు లోకి కేజీ హుళ్లీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం తర్వాత తబ్సీన్ బేబీకి ఓ ట్యాక్సీ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న షేక్ సుహేల్ ఆమెతో గొడవ పడ్డాడు. అయినా కూడా భార్యతీరు మార్చుకోకపోవడంతో పిల్లల కోసం ఊరు ఖాళీ చేయాలని బావించాడు. తిరిగి తన కుటుంబంతో కోల్‌కతాకు చేరుకున్నాడు. కొంతకాలం కాపురం చేసిన తబ్సీన్ బేబీ తిరిగి బెంగుళూర్ కి వెళ్లి ప్రియుడితో కాపురం పెట్టింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.
తాను ఎంతగానో ప్రేమించిన భార్య తనను విడిచి వెళ్లడంతో తీవ్ర ఆవేదన, ఆక్రోశానికి గురైన షేక్ సుహేల్ ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే బెంగుళూరు కి వచ్చి భార్య తబ్సీన్ బేబీ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. తన పిల్లల కోసమైనా తిరిగి రావాలని ఎంతోగానే బ్రతిమలాడాడు. కానీ ఆమె మాత్రం తన ప్రియుడిని విడిచి రానని చెప్పింది.. దాంతో కోపంతో ఊగిపోయిన షేక్ సుహేల్ భార్య గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత చిన్నారిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని తబ్సీన్ బేబీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.. నింధితుడు షేక్ సుహేల్ ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.