విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. జీవితంలో మంచి ఉద్యోగం, మంచి కెరీర్ ఇలా చాలా కలలు కంటుంటారు. ఆ కలల్ను నిజం చేసుకునేందుకు చాలానే కష్టపడతారు. కానీ, కొన్నిసార్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు తప్పుడు దారులు ఎంచుకుంటారు. కష్టపడకుండా సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడొకసారి దొరికిపోక తప్పదు. అలా పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ విద్యార్థినిని డీబార్ చేశారు. అవమాన భారం తట్టుకోలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు జీవనబీమానగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముళబాగిలుకు చెందిన భవ్య(19) కోరమంగళ జ్యోతినివాస్ లో బీకాం ఫస్టియర్ చదువుతోంది. ఓ ప్రైవేటు పీజీ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. హిజాబ్ వివాదం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలను గత వారం నిర్వహించారు. పరీక్షల్లో భవ్య కాపీయింగ్ చేస్తూ దొరికిపోయింది. శుక్రవారం కళాశాల యాజమాన్యం ఆమెను డిబార్ చేశారు.
భవ్య కాపీ కొడుతూ దొరికిపోయిదనే అవమానంతో ఉంటే.. డిబార్ చేయడంతో ఇంకా ఎక్కువ బాధపడింది. అదే రోజు సాయంత్రం తన సోదరికి ఫోన్ చేసి తాను డిబార్ అయిన విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత అవమాన భారంతో తనకు బతకాలని లేదని చెప్పింది. భవ్య మాటలతో సోదరి, తల్లిదండ్రులు ఎంతగానో భయాందోళనకు గురయ్యారు. తర్వాత భవ్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. భయంతో తల్లిదండ్రులు వెంటనే బెంగళూరుకు బయల్దేరారు.
ఇదీ చదవండి: ఒకేసారి ఇద్దరితో ఆంటీ ఎఫైర్.. ఆ పని విషయంలో మొదలైన వివాదం!
భవ్య వసతిగృహం ఐదో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిందండ్రులు చేరుకునే సరికే ఆమె మృతి చెందింది. తమ కుమార్తె ప్రాణాలు పోవడానికి కళాశాల యాజమాన్యమే కారణం అంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి చదువే జీవితం కాదు. చదివిన ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించలేరు. ఏదైనా సాధించాలి అంటే ముందు బతికుండాలి. చదువు లేకుండా అక్షరం ముక్క రాకుండా జీవితంలో పైకొచ్చిన వాళ్లు ఎందరో ఉన్నారు. చదువు మీద ఇంట్రస్ట్ లేకపోతే మీకు దేనిమీద ఆసక్తి ఉందో అదే నేర్చుకోండి. జీవితంలో ఎదగండి అంటూ ఈ ఘటన తెలుసుకున్న వారంతా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.