ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల్లో తలదూర్చిన కొందరు వివాహితలు పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వాడితో సుఖాన్ని అలవాటు పడి హత్యలు, లేదంటే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరు పరిధిలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల నుంచి భార్య ప్రవర్తనలో మార్పొచ్చి కాస్త పక్క చూపులు చూసింది.
ఈ సమయంలో భార్య నారాయణస్వామి అనే వ్యక్తితో కొన్నాళ్ల నుంచి వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యపై కాస్త కన్నేసి ఉంచాడు. ఇటీవల ఓ రోజు బెంగుళూరు పరిధిలోని అనేకాల్ లోని చంద్రపూర్ లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని భార్య భర్తకు చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన తర్వాత పుట్టింట్లో ఏకంగా ప్రియుడితో సరసాలకు తెర తీసింది. మెల్లగా మాటువేసిన భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే తన అత్తింటికి వెళ్లి ఇంటి తలుపులు తీశాడు.
ఇక బెడ్ పై భార్యతో పాటు ప్రియుడు నారాయణ స్వామి నగ్నంగా కనిపించడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఇంట్లో ఉన్న కత్తితో తన భార్యను, ఆమె ప్రియడిని అక్కడికక్కడే దారుణంగా హత్య చేశాడు. అనంతరం వారి శవాలను బయటకు లాక్కొచ్చి పెద్దగా కేకలే వేయడంతో ఊరంత ఈ సీన్ ను చూసి షాక్ కు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక భర్తను కాదని పరాయి వాడి మోజులో పడి ప్రాణాలు విడిచిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.