ఈ మధ్య సినిమా చూసి హత్య చేశాం. ఆ వెబ్ సిరీస్ చూసి కిడ్నాప్ చేశాం అని చెప్పడం పెరిగిపోయింది. తాజాగా ఓ హత్య కేసులో నిందితుడు కూడా నేను దండుపాళ్యం సినిమా చూసి ఆ హత్య చేశాను అని చెప్పాడు. అనంతపురం జిల్లా కదిరిలో కలకలం రేపిన టీచర్ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. దాదాపు 1 ఫోన్ కాల్స్ పరిశీలన, 5 వేల మందిని విచారించిన తర్వాత అసలు నిందితుడిని పట్టుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబరులో కదిరిలో ఓ టీచర్ ఉషారాణి హత్యకు గురయ్యారు. ఆ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఎవరు చేశారు? ఎందుకు ఆ హత్య జరిగింది అనే క్లూస్ పోలీసులకు దొరకలేదు. విచారణలో భాగంగా పోలీసులు దాదాపు ఒక లక్ష ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. దాదాపు 5 వేల మంది అనుమానితులను విచారించారు. అంతమందిని విచారించిన తర్వాత అసలు నిందితుడు షఫీవుల్లాను అరెస్టు చేశారు. అతడిన విచారించిన తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
అతను ఆ హత్య చేసింది దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. అంతే కాకుండా ఆ చిత్ర యూనిట్ పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. షఫీవుల్లా కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలతో విచారణ చేశారు. నిందితుడు కర్ణాటకు చెందినవాడు. కదిరిలో నివాసం ఉంటున్నాడు. గతంలోనే ఇతనికి నేర చరిత్ర ఉంది. ఏడు కేసులు ఉన్నాయి, జైలుకు కూడా వెళ్లాడు. నిందితుడి నుంచి పోలీసులు 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భర్తని మోసం చేసి మామతో! మామకి తెలిసే మరో యువకుడితో! ఈమె ఆడదేనా?