నేటి కాలంలో చాలా మంది భార్యాభర్తలు సొంత సంసారాలను గాలికొదిలేసి పరాయి సుఖం కోసం పాకులాడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది పెళ్లైన వ్యక్తులు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి భార్యా పిల్లలను కాదని పరాయి మహిళ కోసం చనిపోవడానికి కూడా సిద్దపడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఉప్పరపల్లికి చెందిన జయలక్ష్మీ, గురుమూర్తి ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే అప్పుడప్పుడు గురుమూర్తి దగ్గర్లో ఉన్న ఓ దాబాకు వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అక్కడ పని చేస్తున్న పెళ్లై భర్తను వదిలేసిన సాయిలీల అనే మహిళతో గురుమూర్తి పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అలా రోజుల గుడస్తున్న కొద్ది సొంత కుటుంబాన్ని వదిలేసిన గురుమూర్తి సాయిలీలతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. దీంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.వీరిద్దరి చీకటి ప్రేమాయణం ఇరు కుటుంబాల్లో తెలిసి ఇద్దరిని మందిలించే ప్రయత్నాలు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గురుమూర్తి, ప్రియురాలు సాయిలీల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వీరి మరణ వార్త తెలుసుకున్న ఇద్దరి కుటుంంబికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇలా సొంత కుటుంబాలను కాదని పరాయి సుఖం వెంపర్లాడుతూ చికటి మరణశాసనాన్ని వారి చేతులతోనే రాసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.