ప్రేమ.. ఓ యువతి యువకుడి మధ్య సాగే ఓ అద్భుతమైన కథ. ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి లవ్ స్టోరీలోకి కొందరు దూరిపోయి వీటినే క్యాష్ చేసుకుంటూ వారిని అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. కోరిక తీర్చాలని కాదంటే చంపేస్తానంటూ లేదంటే మీ ఇంట్లో చేబుతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు.
అచ్చే ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామంలో బెస్త గురుమూర్తి అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇక అదే గ్రామంలో ఉంటున్న ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇక ఈ విషయం అదే గ్రామంలో ఉంటున్న యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు తిరుపాల్ అనే యువకుడికి తెలిసింది. మనోడు దీన్నే క్యాష్ చేసుకోవాలంటూ సంబరపడిపోయాడు. ఇక ఓ రోజు ఇద్దరితో కలిసి నీ ప్రియురాలితో నా కోరిక తీర్చాలని, లేకుంటే మీ ఇంట్లో వాళ్లకి అంతా చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలా కొన్ని రోజుల పాటు వీరిని భయందోళనకు గురి చేయడం మొదలు పెట్టాడు.
అయితే వీరిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఓ సంచలన నిర్ణయానికి వచ్చారు. వీడి బ్లాక్ మెయిల్ కు తట్టుకోలేని ఈ ప్రేమ జంట తిరుపాల్ హత్యకు ప్లాన్ వేశారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తిరుపాల్ ని చంపాలని రూ.3.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆ వ్యక్తిని నమ్మించి ఓ రోజు రాత్రి ఓ గ్రామంలోని ఓ చోటుకు తీసుకెళ్లి కత్తులతో హత్య చేశారు. ఆ తర్వాత అతని శరీరాన్ని రాయికి తాళ్లతో కట్టి బావిలో పడేశారు.
ఇక తిరుపాల్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తిరుపాల్ మొబైల్ చివరి కాల్ ఆధారంగా అతడిని నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి రూ.80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.