ఆడపిల్లలు పెళ్లి అనే ఓ బంధంతో తన సొంత వారిని వదులుకొని ఒక కొత్త కుటుంబంలోకి వెళ్తారు. తన పుట్టింటి దగ్గర ఉన్న రాజసం, ధైర్యం అక్కడ ఉండకపోవచ్చు.అయిన అమ్మాయిలు అన్నిటికీ సర్ధుకుంటూ అత్త, మామలతో మిగిలిన ఇంటి సభ్యులతో కలిసిపోతారు. కానీ కొంత మంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రలను వదలి ఉండలేరు. అలా అమ్మనాన్నలను వదలి అత్త వారింటికి వెళ్లాలన్న బెంగతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన అనంతపురంలో జరిగింది.
వివాహం జరిగి సరిగ్గా నెల రోజులు కూడా కాకుండానే కాళ్ల పారాణిపై కన్నీటి చుక్క రాలిపోయింది. తల్లిదండ్రుల ఆశలు, తోబుట్టువుల ఆనందం ఒక్కసారిగా మాయమైంది.ఆ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. తన పుట్టినిల్లును వదిలి అత్త వారింటికి వెళ్లాలన్న బెంగతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే…. అనంతపురం పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న సూర్యనారయణకు భార్య, ఇద్దరు పిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి పెద్ద కూతురు సుజన(26) బీటెక్ పూర్తి చేసింది.
ఇటీవల సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. బుక్కరాయసముద్రం సచివాలయం-2లో విధులు నిర్వహిస్తోంది. గత నెల 17న చెన్నే కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు విశ్వనాద్ తో వివాహమైంది. పది రోజుల పాటు సెలవు పెట్టి పుట్టింట్లో ఉంది.అనంతరం సోమవారం తిరిగి విధులకు హాజరైంది. ఆ మధ్యలో వారం రోజులుగా మెట్టింటికి వెళ్లే ప్రయాణాన్ని వాయిదా వేస్తు వస్తుంది. తల్లిదండ్రులు సర్థి చెప్పి వెళ్లాలని సూచించారు.
అమ్మనాన్నలను మీద బెంగ పెట్టుకుంది. ఈ తరుణంలో సోమవారం విధులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం స్నానం గదిలో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మనాన్నలను వదలి వెళ్లటం ఇష్టం లేకుంటే మరో మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఈ యువతి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం ముగించింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.