భార్యాభర్తల కాపురాల్లో గొడవల జరగడం సహజం. కానీ అదే కోపాన్ని పిల్లలపై చూపిస్తే ఎలా? ఇలా భార్యపై కోపాన్ని తన కుమారుడిపై చూపించిన ఓ కసాయి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఊహించని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..వడమాలపేట మండలం బట్టీకండ్రిగ. దళితవాడకు చెందిన రమేష్ (42), ఐశ్వర్య (32) ఇద్దరు భార్యాభర్తలు.
ఇదే గ్రామానికి చెందిన వీరిద్దరూ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. కుమారుడు 7 ఏళ్ల వయసుండగా, కూతురు ఇంటివద్దే తల్లితో పాటు ఉంటోంది. అయితే భర్త డిక్సన్ కంపెనీలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భర్త రమేష్ కొంత కాలం బాగానే ఉన్నరోజులు మారే కొద్ది మద్యానికి అలవాటు పడ్డాడు. అలా రోజు తాగి రావడం, భార్యా పిల్లలను వేధించడం పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది.
ఇది కూడా చదవండి: Rajasthan: సెలవు ఇవ్వలేదని రిఫైల్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య!
దీంతో కోపంతో ఊగిపోయిన రమేష్ భార్యపై దాడి చేయడంతో చేయి విరిగిపోయింది. దీంతో స్థానికంగా ఓ చోట చేయి కట్టు కట్టించుకుని పుట్టింటికి వెళ్లి ఆదివారం తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల రాత్రి అన్నం వండలేదని భర్త రమేష్ భార్యతో గొడవకు దిగాడు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో భయంతో అత్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు రమేష్ ని స్టేషన్ కు రావాలంటూ కబురు పంపారు. నా కుమారుడి ఆరోగ్యం బాగలేదని, నేను రాలేనని చెప్పాడు. ఇక ఫుల్ గా మద్యం సేవించిన రమేష్ భార్యపై కోపంతో కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయలపాలైన ఆ బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.