ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకున్నారు. కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆసారాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం గుడిలో ఉన్న డబ్బును దొంగిలించడమే కాకుండా ఏకంగా ఆ దేవుడి విగ్రహాలను సైతం దొంగిలించేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అయితే అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన ఓ దొంగ గుడిలోకి వచ్చి హుండిలో ఉన్న డబ్బు అంతా సర్ధేశాడు. ఆ దేవుడి మహిమో ఏమో కానీ, చివరికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉన్న వకుళామాత గుడిలో ఇటీవల ఓ వ్యక్తి చోరికి యత్నించాడు. తాను అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి గుడిపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. ఇక ఆ తర్వాత గడ్డపార సాయంతో హుండిని పగలగొట్టి డబ్బంతా సర్దేసి మూట గట్టేశాడు. ఆ తర్వాత మెల్లగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలోనే ఆ దేవుడి మహిమో ఏమో కానీ అతడు కట్టిన మూట ఊడిపోయి కిందపడిపోయి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఆ దొంగ ఒక్కసారిగా భయంతో ఊగిపోయాడు.
ఆ క్షణంలో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెంటనే అటు ఇటు చూసి గుడిలో చోరీ చేసిన మూటను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో అనుమానం వచ్చిన ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ దేవుడి మహిమ వల్లే దొంగ ఆ సొమ్మును తీసుకెళ్లలేకపోయాడని భక్తులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మీరేం అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.