ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు దుర్మార్గులు రోడ్డుపై కనిపించిన అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ ఆర్టీసీ డ్రైవర్ 6వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ డ్రైవర్ అభం, శుభం తెలియని 6వ తరగతి బాలికపై బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి కుటుంభికులు, స్థానికులు అతడిని బస్సులో నుంచి బయటకు దించి మరీ చితకబాదారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో 6వ తరగతి చదువుతుంది.
ఆ బాలిక రోజూ ఆ డ్రైవర్ బస్సు ఎక్కి స్కూల్ కు వెళ్తుండేది. దీంతో ఆ ఆర్టీసీ డ్రైవర్ ఆ బాలికపై కన్నేశాడు. రోజూ ఆ బాలికతో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇక రాను రాను అతడు ఆ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక కుటుంభికులు, స్థానికులు బస్సులో నుంచి ఆ కీచక డ్రైవర్ ను కిందకు దించి అతడిని నడి రోడ్డుపైనే చితకబాదారు. అనంతరం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇదంతా స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది.. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అభం, శుభం తెలియని 6వ తరగతి బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన ఈ నీచుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.