ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చాల మంది తమ వ్యక్తిగత విషయాలు వెల్లడించి తర్వాత ఇబ్బందుల పాలవుతున్నారు. ముక్కు ముఖం తెలీని వారికి చెప్పడమే కాదు.. ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడం తరువాత వాటికీ బలి కావడం చూస్తూనే ఉన్నాం. అవి కొన్ని సార్లు ప్రాణాలు తీసే వరకు విషయాలు వెళుతుంటాయి. అచ్చం ఓ టిక్ టాక్ స్టార్ విషయంలో ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే..
అమెరికన్ టిక్ టాక్ స్టార్ సానియా ఖాన్ తన భర్తతో తన వైవాహిక జీవితాన్ని ఎందుకు దూరం అయ్యిందో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పెళ్లైన తరువాత తన ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తాను పడ్డ కష్టాల గురించి మొత్తం ఆ వీడియోలో వివరించింది. అది చూసి ఆమె మాజీ భర్త ఎంతో అవమానంగా భావించి ఆమెను అమానుషంగా హత్య చేశాడు.
టిక్ టాక్ స్టార్ సానియా ఖాన్ కి మంచి పేరు ఉంది. అంతేకాదు ఆమెకు ఇన్ స్ట్రాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మాజీ భర్త రహెల్ అహ్మద్ లు ఐదు ఏళ్ళు సహజీవనం చేసి 2021లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. సానియా ఖాన్ టిక్ టాక్ స్టార్ కావడంతో ప్రతి విషయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. ఆమె టేనస్సీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో తన భర్తకు సంబంధించిన విషయాలన్నీ వివరిస్తూ…పోస్ట్‌లు పెట్టింది.
సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయాల్ని అందరికి చెప్పడంతో ఘోర అవమానంగా భావించిన ఆమె మాజీ భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. కాగా, అహ్మద్ తల్లిదండ్రులు తమ కొడుకు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై తుపాకులతో యువకుల హల్ చల్!
ఇది చదవండి: లైంగిక దాడి చేసి హత్య చేసిన యువకుడు.. ఒక చిన్న పొరపాటుతో..