చిన్న పిల్లలు పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటుంటారు. కొన్ని సార్లు చిన్నపిల్లలు తమకు తెలియకుండా చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకువస్తుంటాయి. ఇటీవల చిన్న పిల్లలు ఒంటరిగా ఉండటం గమనించి కుక్కలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు పిల్లలు తినే వస్తువులు అనుకొని పురుగుల మందు, ఎలుకల మందు తిన్న సందర్భాలు ఉన్నాయి.
మృత్యువు మనుషులను ఎప్పుడు ఎలా కబలిస్తుందో తెలియదు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండలని పెద్దలు చెబుతుంటారు. చిన్న ఏమరపాటు చిన్నారుల ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉంటాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ అనుకొని ఎలుకల పెస్ట్ తిని మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా పెద్దగోపతి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎలుకల నివారణ కోసం తీసుకు వచ్చిన పేస్ట్ ని చాక్లెట్ అనుకొని మూడేళ్ల చిన్నారి తిని మృతి చెందింది. చిన్నారి పేరు వైష్ణవి. సెల్వరాజు, వెంటకమ్మ దంపతుల ముద్దులు కూతురు వైష్ణవి. ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు. గత కొంత కాలంగా సెల్వరాజు ఇంట్లో ఎలుకల సంచారం బాగా పెరిగిపోవడంతో వాటిని నివారించేందుకు మందు తీసుకు వచ్చాడు. పేస్ట్ రూపంలో ఉన్న ఆ మందుని ఉండలుగా చుట్టి ఎలుకలు సంచరించే చోట పెట్టాడు. ఈ శనివారం 25న ఇంట్లో ఆడుకుంటున్న వైష్ణవి ఎలుకల కోసం పెట్టిన మందు వద్దకు వెళ్లింది. ఆ ఉండలను చాక్లెట్ గా భావించి పొరపాటున తినేసింది. ఆ సమయంలో వైష్ణవి తల్లి ఇంట్లో పనిచేసుకుంటుంది. పాప నోటి నుంచి నురగలు రావడం చూసి ఒక్కసారే భయపడిపోయింది.
పాప ఎలుకల కోెసం పెట్టిన ఉండలను తిన్నట్టు గమనించారు తల్లిదండ్రులు. అప్పటికే వైష్ణవి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. నాలుగు రోజలు పాటు ప్రాణాలతో పోరాడిన ఆ చిన్నారి మంగళవారం చనిపోయింది. అప్పటి వరకు తమ కళ్ల ముందు సంతోషంగా ఆడుకుంటున్న చిన్నారి ఎలుకల కోసం పెట్టిన గులికలు తిని తమ కళ్ల ముందే చనిపోవడంతో వైష్ణవి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరయ్యారు.. వారి ఆవేదన చూసి చుట్టుపక్కల జనాలు సైతం కంటతడి పెట్టారు.