తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ నాగరాజు కారులో హత్యకు గురయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ప్రేమ, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని పోలీసులు ఇప్పటికీ ఎన్నో కేసుల్లో తెలిపారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. తాజాగా తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారుతోంది. ఈ కేసులో తాజాగా కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఏపీలోని తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం బ్రహ్మణపల్లి గ్రామం. ఇక్కడే నాగరాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో సులోచన అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త నాగరాజు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నాగరాజుకు పురుషోత్తం అనే తమ్ముడు ఉన్నాడు. ఇతడు ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పురుషోత్తం ఎవరికీ తెలియకుండా తన చీకటి కాపురాన్ని కొన్నాళ్ల నుంచి నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇదే విషయం తన ప్రియురాలు భర్త అయిన వితింజయ్ కు తెలియడంతో అనేక సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇదిలా ఉంటే వితింజయ్ స్నేహితుడు చాణక్య గ్రామ సర్పంచ్ గా ఉన్నాడు.
ఇతని సహకారంతోనే వితింజయ్.. పురుషోత్తంకు అనేక సార్లు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇకపోతే పురుషోత్తం వివాహేతర సంబంధం గురించి సర్పంచ్ చాణక్య.. అతని సోదరుడైన నాగరాజుకు కూడా వివరించారు. ఇద్దరిని పిలిపించి సర్పంచ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. గత కొంత కాలంగా వితింజయ్, సర్పంచ్ చాణక్, నాగరాజు, పురుషోత్తం మధ్య ఈ పంచాయితీ నడుస్తూనే ఉంది. అయితే ఇందులో భాగంగానే సర్పంచ్ చాణక్య.. నీతో మాట్లాడాలంటూ తాజాగా నాగరాజును బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వితింజయ్, సర్పంచ్ చాణక్య, నాగరాజు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది.
అదే రోజు తిరుపతి నుంచి గంగుడుపల్లె వెళ్తుండగా మధ్యలో ఓ కారు పూర్తిగా దగ్దమైంది. ఆ కారులో నాగరాజు కాలి బూడిదై కనిపించాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాగరాజు భార్య సులోచన, అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నా భార్తను కారణం సర్పంచ్ చాణక్య, గోపి, రూపేంజయ, సుబ్రహ్మణ్యం కారుకు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారని తెలిపింది. రాజీ కుదురుస్తానని సర్పంచ్ చాణక్య తీసుకెళ్లి నా భర్తను అన్యాయంగా హత్య చేశారని, నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాడతామని మృతుడి భార్య సులోచన ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగా ఓ అన్న ప్రాణం పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.