దేవుడి గుడిలో దొంగతనాలు జరగటం అన్నది సర్వ సాధారణ విషయమే. దేవుడంటే భయంలేని దొంగలు దేవుడి గుడిలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. దేవుడంటే భయం, భక్తి ఉన్న దొంగలు కూడా కొన్ని సార్లు దేవుడి గుడిలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. అయితే, వీరు దొంగతనానికి పాల్పడే తీరు చాలా వెరైటీగా ఉంటుంది. దేవుడ్ని మొక్కుకుని, క్షమాపణ అడిగి మరీ దొంగతనం చేస్తూ ఉంటారు. తాజాగా, కూడా కొంతమంది దొంగలు దేవుడి గుడిలో దొంగతనానికి వెళ్లారు. మరి, భయం కారణంగానో, భక్తి కారణంగానో.. దేవుడ్ని ప్రార్థించుకున్నారు. క్షమాపణ అడిగి మరీ దొంగతనం చేశారు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలోని తిత్వా పోలీస్ స్టేషన్ పరిధిలో మా కాళీ మహదేవ్ జి అక్షయ్ గుడి ఉంది. ఈ గుడికి ప్రతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. రాత్రి వేళల్లో గుడి మూసి వేయబడుతుంది. ఇలాంటి ఈ గుడిలో సోమవారం దొంగలు పడ్డారు. గుడి గేటు తాళాలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. హుండీని దోచుకెళ్లటానికి ప్లాన్ చేశారు. అయితే, దొంగతనానికి ముందు గర్భ గుడిలోకి వెళ్లారు. దేవుడ్ని ప్రార్థించారు. దొంగతనం చేస్తున్నందుకు క్షమాపణ కోరారు. అనంతరం హుండీని తీసుకెళ్లిపోయారు.
అయితే, దొంగతనం దృశ్యాలు లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గుడి నిర్వాహకుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు బంగారు ఉంగరాలు, రెండు వెండి వస్తువులు, వెయ్యి నగదు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ దొంగలకు కూడా భయం, భక్తి ఉంది’’.. ‘‘ దేవుడి గుడిలో దొంగతనానికి వచ్చి.. దేవుడికే పూజలు చేస్తున్నారు.. వీళ్లు మంచి దొంగలంటే’’.. ‘‘ ఇలాంటి దొంగలు చాలా అరుదుగా ఉంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 28, 2023