మధ్యప్రదేశ్ లో దొంగలు దారుణానికి తెగబడ్డారు. ఒంటరి మహిళపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు కడియాల కోసం ఏకంగా మహిళ కాళ్లు నరికి పరారయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎక్లారా గ్రామంలో రతన్ బాయి అనే మాహిళ పొలంలో పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేశారు. దీంతో ఎలాగైన ఆ మహిళ కాళ్లకు ఉన్న కడియాల ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాలని పథకం రచించారు.
పథకంలో భాగంగానే ఇద్దరు ముగ్గురు ఒంటరి మహిళను పట్టుకుని కడియాలు లాగేందుకు ప్రయత్నం చేశారు. ఆ మహిళ తిరగబడటంతో ఏ చేయాలో తెలియక కడియాల కోసం ఆ మహిళ కాళ్లను నరికి కడియాలతో పాటు ఒంటిపై ఉన్న బంగారు అభరణాలను తీసుకుని పరారయ్యారు. ఇక తీవ్ర రక్త స్రవం అవ్వటంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. ఇక గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.