అనిల్‌ను త్వరలోనే పట్టుకుంటామని, ప్రజలు ఆందోళన పడవద్దని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికి ప్రజలు మాత్రం అతడి గురించి ఓ కంట భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏం చేస్తాడోనని అల్లాడుతున్నారు.
ఆ ఊరికి అనిల్ భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఇంటి మీద పడతాడో అర్థంకాక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబాల వాళ్లు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. అతడు ఊర్లో తిరుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో అల్లాడుతున్నారు. ఇంతకీ ఎవరా అనిల్? ప్రజలు అతడికి భయపడాల్సినంత సీన్ ఏముంది? అన్న విషయాల్లోకి వస్తే..
ఆవుల అనిల్ పేరు మోసిన గజదొంగ. అతడి మీద ఇది వరకే చాలా కేసులు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా. దీంతో ప్రజలకు అతడి గురించి బాగా తెలుసు. ఒకరంగా చెప్పాలంటే భయం. అలాంటి అనిల్ కొన్నేళ్ల పాటు సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నాడు. కాకినాడ ఎల్ బీ నగర్‌లోని ఓ ఇంటి ముందు అనిల్ రెక్కీ నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో కాకినాడ డీఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. అతడు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అనిల్‌ను పట్టుకుంటామని చెప్పారు. అనిల్ విషయం తెలుసుకున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో అతడు చేసిన నేరాలను తల్చుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏ ఇంటి మీద పడతాడో తెలియక అల్లాడిపోతున్నారు. పోలీసులు మాత్రం ప్రజల్ని భయపడవద్దని, అనిల్ త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు.